సామ్రాట్ చౌదరి సీఎంగా పనికి రాడు: ప్రశాంత్ కిషోర్

కలం, వెబ్ డెస్క్: బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి పనికి రాడని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) స్పష్టం చేశారు. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రశాంత్ కిషోర్ పాట్నాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి సమర్థుడైన, విద్యావంతుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. అప్పుడే విద్య, ఉద్యోగం, ఉపాధి, వలసల వంటి కీలక అంశాలపైన సరైన నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. అయితే, కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక కావాలంటే మరో నాలుగేళ్ల సమయం పడుతుందన్నారు. అందుకే, సామ్రాట్ చౌదరిని తొలగించి.. ప్రతిభావంతుడైన వ్యక్తిని సీఎం చేయాలని ఎన్డీయేకు సూచించారు.

అదొక్కటే ప్రధాన డిమాండ్..

బీహార్ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలు తీసుకురావాలని ప్రశాంత్ కిషోర్ అన్నారు. తద్వారా యువతకు భారీగా ఉద్యోగవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. అలాగే, రాష్ట్రం నుంచి వలసలు కూడా తగ్గాలన్నారు. బంకీపూర్ ఎన్నికలో గెలిచినంత మాత్రాన రాత్రికి రాత్రే బెంగళూర్ చేయలేమన్నారు. కానీ, ఇతర నగరాలతో పోటీ పడేలా నియోజకవర్గాన్ని మార్చాలనేదే తన లక్ష్యమన్నారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ వచ్చే ఏడాది విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>