మాణికొండలో ఘనంగా బోనాల పండుగ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ మండలం మాణికొండ గ్రామంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయక మండపాలను దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, బురేమోని చందు యాదవ్, గ్రామ అధ్యక్షులు గంజి నర్సింహులు, జంగం సుధాసాగర్, మహబూబ్‌నగర్ మండల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీక్, గంజి నితీష్, ఆకుల బసవరాజు, జంగం గోవింద్, సనేమోని యాదయ్య గౌడ్, గంజి నరేష్, గంజి కేశి, జంగం రత్నసాగర్, రామాంజనేయులు, పిర్ల శివ, ఏట విజయ్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>