టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు.. శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ​సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని టీ ఫైబర్ అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో ‘టీ-ఫైబర్’పై మంత్రి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ కు సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్దేశించిన గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని టీ ఫైబర్ అధికారులకు సూచించారు.

సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ నిమిత్తం ఎలాంటి బిల్లులు చెల్లించొద్దని స్పష్టం చేశారు. ​’టీ-స్వాన్’ (T-SWAN) నెట్‌వర్క్‌ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ​ప్రతిష్టాత్మక ‘ఫ్యూచర్ సిటీ’కి కూడా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ​రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికి ఇంటర్నెట్’ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

Also Read : రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>