గుజ‌రాత్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: వైసీపీ నేత‌, గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మ‌హ‌మ్మ‌ద్‌ ముస్తఫా షేక్ (Mohammad Musthafa Shaik)ను గుజ‌రాత్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కిడ్నాప్ కేసులో ముస్తఫాను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. గుజ‌రాత్ నుంచి ఆయ‌న‌ను నూజివీడుకు త‌ర‌లిస్తున్నారు. పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్ కేసు గుంటూరులో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ముస్త‌ఫా, ఆయ‌న కుమారుడి హ‌స్తం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రు అభితో పాటు మ‌రో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని పేర్కొంటూ పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఈ నేప‌థ్యంలో వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది. ప్ర‌స్తుతం మ‌స్త‌ఫాను పోలీసులు అరెస్ట్ చేసిన నేప‌థ్యంలో త‌దుప‌రి ఏం జ‌రుగుతుంద‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>