గద్వాల‌లో కుండపోత వర్షం .. నీట మునిగిన పాత బస్టాండ్, మార్కెట్

కలం, జోగులాంబ గద్వాల : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గద్వాల (Gadwal Heavy Rain) పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పాత బస్టాండ్ పరిసరాలు, పాత కూరగాయల మార్కెట్ ప్రాంతం, రథశాల వద్ద ప్రధాన రోడ్లు నీట మునిగిపోవడంతో ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పాత బస్టాండ్ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అలాగే పాత కూరగాయల మార్కెట్‌లోకి వరద నీరు చేరడంతో వ్యాపార సరుకులు తడిసిపోయి సన్నకారు వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. పట్టణంలోని మురుగునీటి కాలువ నుంచి మురుగు నీరు‌స్వల్ప వ్యవధిలోనే రోడ్లపైకి చేరి పొంగిపొర్లిపోయింది. ఈ వర్షకాలంలో ఏకదాటిగా గంటకు పైగా భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. భారీ వర్షం కారణంగా జన జీవనం అతలాకుతలమైంది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వీధులు వరద నీటి ప్రవాహంతో చెరువులను తలపించాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>