రూ.4.50 లక్షల బంగారు గొలుసు రికవరీ..

కలం, హనుమకొండ : పోగొట్టుకున్న రూ.4.50 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి బాధితురాలికి అప్పగించి కాజీపేట పోలీసులు (Kazipet Police) తమ సమర్థతను చాటుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మృదుల శ్రీనివాసన్ ఎన్‌ఐటీ వరంగల్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఐదో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల ఆర్‌ఈసీ ప్రాంగణంలో ఆమెకు చెందిన సుమారు మూడు తులాల బంగారు గొలుసు పోగొట్టుకోవడంతో కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే సీఐ శ్యాంసుందర్ ఆదేశాల మేరకు ఎస్సై శివ పర్యవేక్షణలో క్రైమ్ టీమ్ సభ్యులు సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి సుమారు రూ.4.50 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గొలుసును బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందన, దర్యాప్తు తీరు పట్ల బాధితురాలు మృదుల శ్రీనివాసన్ కాజీపేట పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>