కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) లోని కాశ్మీర్ గడ్డలో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ స్లాబ్ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడారు.
ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు వివిధ శుభకార్యాలు, కార్యక్రమాలు నిర్వహించుకోడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ద్వారా స్థానికుల ఇబ్బందులు దూరమవుతాయని, భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలు తమ కార్యక్రమాలను ఎంతో సౌకర్యమంతగా నిర్వహించుకోడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఓంప్రకాష్, గట్టుస్వామి, ఖాలీద్, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

