ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో కొత్తకోణం.. మరో మహిళతోనూ..

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఉదయ్‌ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవని పోలీసులు దర్యాప్తులో వెల్లడయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదులో హైదరాబాద్ లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉదయ్ కృష్ణా రెడ్డిపై కేసు నమోదయింది. తనపై కేసు నమోదయ్యిందని తెలుసుకున్న ఉదయ్.. తొలుత తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు తనను గాలిస్తున్నారని తెలిసి పరారయ్యారు. అయితే ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసిన పోలీసులు.. ఉదయ్ కృష్ణారెడ్డిని ఆరాంఘర్ చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా.. అతనికి న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశానుసారం ఉదయ్ కృష్ణరెడ్డిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

మహిళతో సంబంధం!

ఈ కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు.. హైదరాబాద్‌తోపాటు ఉదయ్ కృష్ణారెడ్డి స్వస్థలంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. వివిధ డాక్యూమెంట్లు, సోషల్ మీడియా వివరాలు, డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యనాయక్‌ జాదవ్‌ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. అయితే ట్రైనీ మహిళా ఐపీఎస్‌.. ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సంబంధం ఉందని వర్చువల్ గా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కోణంలో దృష్టి సారించారు. ఈ మేరకు కీలక ఆధారాలు రాబట్టినట్లు సమాచారం. ఉదయ్ కృష్ణారెడ్డికి ఏపీలోని మరో మహిళతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సదరు మహిళకు 2014లోని పెళ్లయింది. పలు కారణాలతో 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటోంది. ఈ అవకాశాన్నే వినియోగించుకోవాలని చూసిన వినయ్.. ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు.

లివ్‌ఇన్ రిలేషన్ షిప్‌కి ప్లాన్..

హైదరాబాద్ కు వచ్చిన ఆమె.. కొంత కాలంగా ప్రయివేట్ సంస్థలో పనిచేశారు. అయితే మరింత సాన్నిహిత్యం పెంచుకునేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేయాలని సూచించగా.. ఈ ఏడాది జనవరిలో ఆమె అశోక్ నగర్ లోని ఓ ఐఏఎస్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగంలో చేరారు. ఈ క్రమంలోనే వారు లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉందామని ఉదయ్ ప్లాన్ చేశారు. అయితే తన భర్త నుంచి ఇంకా విడాకులు రాకపోవడంతో సదరు మహిళ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలన్నింటిపై మరింత దర్యాప్తు చేసేందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>