జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు.. 27 గేట్లు ఎత్తివేత

కలం, జోగులాంబ గద్వాల : కర్ణాటక జలాశయాల నుండి కృష్ణానదిలోకి భారీగా వద్ద ప్రవాహం వస్తుండటంతో జూరాల (Jurala Project) వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రానికి జూరాల జలాశయానికి 1,56,500 క్యూసెక్కుల ఇన్‌ ప్లో ఉండగా.. అవుట్ ప్లో లో 1,58,702 క్యూసెక్కులుగా నమోదయ్యింది. గత రెండు రోజుల నుంచి జూరాల ఎగువ ఉన్న భీమా నది నుంచి వరద ప్రవాహం తగ్గడంతో జూరాలకు వరద ప్రవాహం కొంత తగింది.

కాగా, కర్ణాటక లోని నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాలకు1,56,500 ఇన్ ప్లో వస్తుండటంతో ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తివేసి 1,21,383 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పై ఆధారపడిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి,‌ ఎడమ సమాంతర కాలువకు సాగునీటిని వదులుతున్నారు. ఆదివారం సాయంత్రానికి జూరాల జలాశయంలో 317.33 మీటర్ల స్థాయిలో 7.334 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 32,475, నెట్టెంపాడు లిఫ్ట్ కు 750, భీమ లిప్టుకు 1300, కోయిల్ సాగర్ కు 630, క్యూసెక్కుల నీటిని లిప్ట్ చేస్తున్నారు.‌ అలాగే కుడి, ఎడమ, సమాంతర కాలువకు నీటిని విడుదల చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>