తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

కలం, జోగులాంబ గద్వాల : జిల్లా (Jogulamba Gadwal) లోని గట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆరగిద్ద గ్రామానికి మునీశ్వరీ భీమేష్ దంపతులు ఇంటికి తాళం వేసి శనివారం‌ సాయంత్రం మల్దకల్ దేవాలయంలో నిద్ర చేయడానికి వెళ్లారు‌.

అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన దంపతులు అక్కడి వాతావరణం చూసి షాక్ కు గురయ్యారు. దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి, బీరువాను ధ్వంసం చేసి బీరువాలో దాచిన 7.5 తులాల బంగారం రూ. 3.65లక్షలు నగదు అపహరించుకొని వెళ్లినట్లు గమనించారు. ఈ విషయంపై బాధితులు గట్టు పోలీస్ స్టేషన్ లో‌ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సంఘటన స్థలాన్ని గద్వాల డీఎస్పీ వై.మొగులయ్య, సీఐ టి.శ్రీను, గట్టు ఎస్ఐ శేఖర్ గౌడ్ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>