కలం, స్పోర్ట్స్ : టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) సారీ చెప్పాడు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇది హల్చల్ చేస్తోంది. అసలేం జరిగింది? అర్ష్‌దీప్ ఎందుకు అశ్విన్‌కు సారీ చెప్పాడు? అన్న చర్చ మొదలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్ష్‌దీప్.. తన టాప్-5 భారత బౌలర్ల జాబితాను వెల్లడించారు. ఈ సందర్బంగానే అశ్విన్‌కు కూడా సారీ చెప్పడం కీలకంగా మారింది. అసలు విషయం ఏంటంటే.. తన బెస్ట్ బౌలర్ల లిస్ట్‌లో అశ్విన్ చిట్టచివరి 5వ స్థానంలో ఉన్నాడు. అందుకే అర్ష్‌దీప్ సారీ చెప్పాడు.
అర్ష్‌దీప్ తన లిస్ట్‌లో తన ఫేవరెట్ అయిన భువనేశ్వర్ కుమార్‌కు మొదటి స్థానం ఇచ్చారు. స్వింగ్ కింగ్ మహమ్మద్ షమీని రెండో స్థానంలో నిలిపారు. చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను మూడో స్థానంలో, టీమ్మేట్ యుజ్వేంద్ర చాహల్‌ను నాల్గో స్థానంలో ఎంచుకున్నారు. అయితే, దిగ్గజ స్పిన్నర్ అశ్విన్‌కు చివరి స్థానం దక్కింది. టాప్ 4 స్థానాలు పూర్తవ్వడంతో వేరే దారి లేక ఐదో స్థానం ఇచ్చానని అర్ష్‌దీప్ చెప్పారు.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు అశ్విన్ తన తొలి కెప్టెన్ అని గుర్తు చేసుకున్నారు. అంతటి దిగ్గజాన్ని చివరగా నిలబెట్టాల్సి రావడం వల్లనే “సారీ అశ్విన్ భాయ్, నీకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తా” అంటూ సరదాగా క్షమాపణలు కోరారు. అంతేకాకుండా, తన ఆల్-ఫార్మాట్ భారత తుది జట్టును కూడా ప్రకటించారు. సచిన్, గంభీర్, ద్రవిడ్, కోహ్లీ, యువరాజ్, రోహిత్, ధోనీలతో పాటు హర్భజన్, జహీర్ ఖాన్, బుమ్రా, తన పేరును చేర్చుకున్నారు.

