పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 14 మంది మృతి

కలం, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన శాంతి ర్యాలీలో జరిగిన దాడి (Pakistan Suicide Blast)లో 14 మంది మరణించగా, 18 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆదివారం స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో శాంతిని కోరుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి ర్యాలీ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఆత్మాహుతి తరహాలో జరిగిన దాడిలో గాయపడిన వారిని భద్రతా సిబ్బంది సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి జరిగిన ప్రదేశంలో భద్రా సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>