మదినగూడ-సంగారెడ్డి హైవే పనులు వేగవంతం చేయాలి

క‌లం మెద‌క్ బ్యూరో: మదినగూడ నుంచి సంగారెడ్డి (Sangareddy) వరకు జాతీయ రహదారి విస్తర‌ణ పనులను వేగంగా పూర్తి చేయాలని సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన సంగారెడ్డి సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండ్లేండైనా జాతీయ రహదారి పనులు పూర్తి కాకపోవడం దారుణమన్నారు. విస్తరణ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన సంగారెడ్డి నుంచి లింగంపల్లి వరకు అనేక చోట్ల ప్రతిరోజు ట్రాఫిక్ స‌మ‌స్య విపరీతంగా పెరిగింద‌న్నారు.

గంటల తరబడి సమయం వృథా అవుతుంద‌టంతోపాటు, రోజు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు మాణిక్, నర్సింహులు, అశోక్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>