కలం, వెబ్ డెస్క్: రామాయణ మూవీలో సాయి పల్లవి (Sai Pallavi) సీత పాత్రలో నటించడంపై నెటిజన్లలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆమె సహజమైన నటన ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాయని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం శాస్త్రాలలో వర్ణించిన సీత రూపానికి ఆమె సరిపోరని వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. గ్లామర్ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సాయి పల్లవి (Sai Pallavi) గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. మొటిమల సమస్యతో బాధపడుతున్నప్పటికీ మేకప్ లేకుండానే తెరపై కనిపిస్తోంది. ప్రేక్షకులు తనను ఉన్నట్లుగానే ఆమోదిస్తున్నారని, అసలైన ఆత్మవిశ్వాసమే నిజమైన సౌందర్యమని ప్రేక్షకులు గ్రహించినట్లు తెలిపారు. చర్మపు రంగుపై ఉండే వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు.
మలయాళ బ్లాక్బస్టర్ ‘ప్రేమమ్’ చిత్రంతో అరంగేట్రం చేయడానికి గల కారణాలను కూడా ఆమె పంచుకున్నారు. సినిమాకి ముందు తన మొటిమల సమస్య వల్ల ఎన్నో ఫెయిర్నెస్ క్రీమ్లు రాసుకుని, బయటకు వెళ్లడానికి కూడా భయపడినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ‘ప్రేమమ్’ చిత్రం తర్వాత ప్రేక్షకులు తనను ఎలాంటి అభద్రతాభావాలకు తావులేకుండా ప్రశంసించారని అన్నారు. యువత సానుకూల ప్రభావం తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ విందులో భారత్కు అవమానం.. లవ్లీనా ఆగ్రహం!
Follow Us On : WhatsApp

