కలం, నిర్మల్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైల్ భరో (Jail Bharo Protest) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని సీఐటీయూ (CITU) జిల్లా కార్యదర్శి సురేష్ పిలుపునిచ్చారు. ఖానాపూర్ పట్టణంలో ఆదివారం మధ్యాహ్న భోజన కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల జీవనోపాధిపై దాడి చేస్తోందని సురేష్ ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌ల అమలు ద్వారా కార్మికుల హక్కులను హరిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న జైల్ భరో కార్యక్రమంలో (Jail Bharo Protest) కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం
Follow Us On : WhatsApp

