పొన్నం ప్రభాకర్ ఇంట్లో విందు.. సీఎం రేవంత్ హాజరు

కలం, వెబ్ డెస్క్: బోనాల జాతర సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు. ఆయనతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. అతిథుల కోసం పొన్నం ప్రభాకర్ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించి, వడ్డించారు. ఆహ్లాదకర వాతావరణంలో విందు కార్యక్రమం సందడిగా సాగింది. అనంతరం, ముఖ్యమంత్రితో పొన్నం కుటుంబసభ్యులు, ఇతరులు ఫొటోలు దిగారు. పలువురు చిన్నారులను స్వయంగా సీఎం పలకరించి, వారితో ముచ్చటించారు.

Also Read : ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>