భోగాపురం ఎయిర్‌పోర్టుపై గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపనపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టింది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. అయితే ఆ రెండు పనులే చంద్రబాబు చేశారని, మధ్యలో మిగిలిన పనులన్నీ తమ అధినేత జగనే చేశారని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా కొబ్బరికాయ, గుమ్మడికాయం కొట్టడానికి సీఎం అవసరం లేదని .. దారిన పోయేవాడు కూడా కొడతాడని గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన సింహభాగం పనులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. ఈ విషయం ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం మొదట్నించి అలవాటేనని తెలిపారు. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు.. కుప్పం ఎయిర్‌పోర్ట్ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : కామ‌న్వెల్త్ గేమ్స్ విందులో భారత్‌కు అవమానం.. లవ్లీనా ఆగ్రహం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>