అమెరికాలో కార్చిచ్చు.. వంద‌లాది ఇండ్లు ద‌గ్ధం!

క‌లం, వెబ్‌డెస్క్‌: అమెరికాలోని వాషింగ్ట‌న్‌లో ఘోర విప‌త్తు సంభ‌వించింది. స్పోకేన్‌లో కార్చిచ్చు (Spokane Wildfire) చెల‌రేగింది. వంద‌లాది ఇండ్లు కాలి బూడిద‌వుతున్నాయి. మ‌రోవైపు మంట‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి. అధికారులు అప్ర‌మ‌త్త‌మై హెలీకాఫ్ట‌ర్ల‌తో మంట‌లు ఆర్పుతున్నారు. భ‌యంతో స్థానికులు ఇండ్ల‌ను వ‌దిలి ప‌రుగులు పెడుతున్నారు. స్పోకేన్‌లో అధికారులు రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

ఈ కార్చిచ్చుతో దాదాపు 2.5 లక్షల ఎకరాలకు పైగా భూభాగం దగ్ధమైనట్లు తెలుస్తోంది. స్పోకేన్ ప్రాంతంలో ఇప్పటికే చాలా మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్పోకేన్​ వ్యప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ అగ్నిప్రమాదాలను అదుపు చేయడానికి సుమారు 4,000 మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఎవరికైనా గాయాలు అయినట్లు గానీ తమ దృష్టికి రాలేదని అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>