రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal ) రూరల్ మండలం కొండాపూర్ 11 కేవీ సబ్‌స్టేషన్‌ లో మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొండాపూర్, రత్నాపూర్ కాండ్లి, రత్నాపూర్ కాండ్లి తండా ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, అలాగే నిర్మల్ టౌన్-3 పరిధిలోని 11 కేవీ శాంతినగర్ ఫీడర్ పరిధిలో శాంతినగర్, గాయత్రి టౌన్‌షిప్, వాసవి వరల్డ్ స్కూల్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,11 కేవీ వెంకటాపూర్ ఫీడర్ పరిధిలోని వెంకటాపూర్, బృందావన్ కాలనీ, హెచ్‌పీ గ్యాస్ గోదాం ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>