మెడిక‌ల్ కాలేజీలో బాంబుల త‌యారీ క‌ల‌క‌లం!

క‌లం, వెబ్‌డెస్క్‌: అయోధ్య (Ayodhya)లోని రాజ‌ర్షి దశరథ్ మెడిక‌ల్ కాలేజీ (Rajarshi Dashrath Medical College) లో బాంబుల‌ త‌యారీ వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా కాలేజీలోని ఎక్స్ రే గ‌దిలో దొరికిన ఓ డాక్యుమెంట్‌తో ఈ బాంబు త‌యారీ వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. వివ‌రాల్లోకి వెళ్తే… శ‌నివారం సాయంత్రం కాలేజీ యాజ‌మాన్యం ఎక్స్ రే గ‌దిలో ఓ డాక్యుమెంట్‌ను గుర్తించింది. ఇందులో బాంబుల త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు, త‌యారీ విధానం గురించి రాసి ఉంది. దీనిపై కాలేజీ యాజ‌మాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టి స‌ర్ఫ‌రాజ్ అనే ఎంబీబీఎస్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. శుక్ర‌వారం రాత్రి స‌ర్ఫ‌రాజ్ స్వ‌యంగా త‌న చేతి రాత‌తో ఈ డాక్యుమెంట్ రూపొందించాడు. స‌ర్ఫ‌రాజ్‌ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని బ‌ల‌రాంపూర్‌కు చెందిన వాడిగా గుర్తించారు. శుక్ర‌వారం రాత్రి విధుల్లో ఉన్న ఇద్ద‌రు సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>