సుప్రీంకోర్ట్ తీర్పుపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

కలం, కరీంనగర్ బ్యూరో: గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ.. అభిషేక్ సింగ్వి లాంటి ప్రముఖ న్యాయవాదులతో సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.

కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని.. పూర్తయితే లక్షల ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు తాగు నీటి అవసరాలు తీరుతాయని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ, ప్రభుత్వ న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని అభినందించారు.

Also Read : హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>