రామగుండంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ విజయవంతం

కలం, కరీంనగర్ బ్యూరో: రామగుండం (Ramagundam) పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైనట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో పోలీస్, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక, విద్యా, బాలల సంరక్షణ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. ప్రతి సబ్ డివిజన్‌ పరిధిలో ఎస్‌ఐతో పాటు నలుగురు పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు. ఫలితంగా జులై 1 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 278 మంది బాలబాలికలను గుర్తించి రక్షించినట్లు వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లాలో అధికంగా..

పెద్దపల్లి జిల్లా పరిధిలో 130 మంది బాలురు, 21 మంది బాలికలను రక్షించి వారిని 11 కేసుల్లో 12 మందిని అరెస్టు చేసినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా వివరించారు. అలాగే, మంచిర్యాల జిల్లా పరిధిలో 102 మంది బాలురు, 25 మంది బాలికను గుర్తించి రక్షించి, ఏడుగురిని అరెస్టు చేశారు. బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని సీపీ తెలిపారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిసినా, తప్పిపోయినట్లు సమాచారం తెలిసినా వెంటనే ఛైల్డ్ హెల్ప్‌లైన్ 1098, డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>