మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే: రాహుల్‌ గాంధీ

కలం, వెబ్ డెస్క్: దేశ యువతకు ప్రధాని మోదీ (PM Modi) క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. విద్యార్థులనే క్షమించేశానని మోదీ పేర్కొనడం వింతగా ఉందన్నారు. పిల్లలను కోల్పోవడాన్ని మించిన బాధ ఏ తల్లిదండ్రులకైనా ఏముంటుందని ప్రశ్నించారు. అది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందన్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షలు రద్దు కావడం వలన సంవత్సరాల తరబడి విద్యార్థులు చేసిన శ్రమ పనికి రాకుండా పోతోందని.. విద్యా వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని మాత్రమే వారు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రధాని ఒక్కరినైనా కలిశారా..?

నీట్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాల్లో కనీసం ఒక్కరినైనా ప్రధాని మోదీ కలిశారా..? అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు. పేపర్ లీక్ కారణంగా విద్యార్థుల పడిన క్షోభను కనీసం విన్నారా..? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ క్షమాగుణం విద్యార్థులకు అవసరం లేదన్నారు. కానీ, ఆయన చెప్పే క్షమాపణ కోసం విద్యార్థి లోకం ఎదురు చూస్తోందన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ దారుణంగా మారిపోయిందని.. దాన్ని మార్చాల్సిందేనని స్పష్టం చేశారు.

Also Read : మోదీ ఇంటిని ముట్టడిస్తాం.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>