కామ‌న్వెల్త్‌ గేమ్స్‌లో భార‌త్‌కు మ‌రో రెండు స్వ‌ర్ణాలు!

క‌లం, వెబ్‌డెస్క్‌: కామ‌న్వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games) లో భార‌త్ ఖాతాలో మ‌రో రెండు స్వర్ణాలు చేరాయి. మ‌హిళ‌ల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో బాక్స‌ర్ ప్రీతి ప‌వార్ (Preeti Pawar) బంగారు ప‌త‌కం సాధించారు. ప్రీతి ప‌వార్ ఫైన‌ల్ మ్యాచ్‌లో కెన‌డా బాక్స‌ర్ స్కార్లెట్ స‌వ‌న్నా డెల్గాడోను ఓడించి ఈ ఘ‌న‌త సాధించారు. మ‌రోవైపు 57 కేజీల విభాగంలో జైస్మిన్ లంబోరియా స్వ‌ర్ణం సాధించారు. ఇప్ప‌టి వ‌ర‌కు కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ ఐదు స్వ‌ర్ణ ప‌త‌కాలు సాధించ‌గా, ఈ పతకాలతో ఆ సంఖ్య ఏడుకు చేరుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ 25 ప‌త‌కాలు ప‌త‌కాలు గెల్చుకుంది. ఇందులో ఏడు స్వ‌ర్ణ ప‌త‌కాలు, 12 ర‌జ‌త ప‌త‌కాలు, 6 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి.

Also Read : మోదీ ఇంటిని ముట్టడిస్తాం.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>