కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తిరుమల పర్యటనలో భాగంగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు భక్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆయన నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద పర్యావరణ హితమైన ఈవీ (EV) బస్సులకు సీఎం పచ్చజెండా ఊపి ఫ్లాగ్ఆఫ్ చేయనున్నారు. దీంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలను అందించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన ప్రపంచ స్థాయి ఎస్వీ (SV) మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమాల అనంతరం తిరుమలలోని అధికారులతో సీఎం సమావేశమై క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం వేళకు ఆయన ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. అనంతరం అమరావతిలో జరిగే ఎస్ఎల్బీసీ (SLBC) కీలక సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

