మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం… 12 వాహనాల సీజ్..!

​కలం, ఖమ్మం బ్యూరో : మోడిఫైడ్ సైలెన్సర్లతో (Modified Silencer) కర్ణకఠోర శబ్దాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ద్విచక్ర వాహనాలపై భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem)  జిల్లా ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 12 బైక్‌లను గుర్తించి సీజ్ చేయడంతో పాటు, సదరు వాహనదారులపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధించారు.

​జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కంపెనీ అమర్చిన సైలెన్సర్లను తొలగించి, అధిక శబ్దం వచ్చేలా మోడిఫైడ్ సైలెన్సర్లతో వాహనాలు నడుపుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పట్టుబడిన 12 వాహనాలపై మోటారు వాహనాల చట్టం–1988 సెక్షన్ 190(2) ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు వసూలు చేశారు. అనంతరం ఆ వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను అక్కడికక్కడే తొలగించి పోలీస్ స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్నారు.

​ఈ సందర్భంగా కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌ఎచ్ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం వల్ల తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడి రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వాహనాల్లో ఇటువంటి మార్పులు చేయడం చట్టవిరుద్ధమని, వాహనదారులు తప్పనిసరిగా కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించకుండా శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Also Read : యువతకు అజిత్ దోవల్ కీలక సూచన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>