సంగారెడ్డిలో దారుణం.. పొలంలో యువకుడి హత్య!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ఎస్. ఇటిక్యాల వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఒక పొలంలో తీవ్ర రక్తపు మరకలతో పడి ఉన్న ఓ యువకుడి మృతదేహం స్థానికులకు కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే పుల్కల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలు, నమూనాలు సేకరించారు.

మృతుడిని ముదిమాణిక్యం తండాకు చెందిన రాజు (27) గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజును ఎవరో దారుణంగా హత్య చేసి, ఆధారాలు లభించకుండా పొలంలో పడేసి వెళ్లి ఉంటారని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, హత్యకు గల కారణాలు మరియు నిందితుల వివరాలను రాబట్టేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.

Also Read : యువతకు అజిత్ దోవల్ కీలక సూచన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>