ఇదే ఉత్తరాంధ్ర దెబ్బ‌.. జ‌గ‌న్‌కు లోకేశ్ కౌంట‌ర్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: “ఎర్ర బ‌స్సు రాని చోటుకు ఎయిర్ పోర్ట్ అవ‌స‌ర‌మా అన్నారు.. ఎర్ర బ‌స్సు రాద‌న్న‌ చోటుకే ఇప్పుడు ఎయిర్‌ బ‌స్సు వ‌చ్చింది. ఇదే ఉత్త‌రాంధ్ర దెబ్బ‌.. అర్థ‌మైందా రాజా” అంటూ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మాజీ సీఎం జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా భోగాపురంలో నిర్మించిన ఎయిర్ పోర్టును నేడు ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ మాజీ సీఎం జ‌గ‌న్ స‌హా వైసీపీ నేత‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. గ‌తంలో కొంద‌రు ఉత్త‌రాంధ్ర‌ను త‌క్కువ చేసి మాట్లాడార‌న్నారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించార‌ని చెప్పారు. ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌లో జ‌రుగుతున్న అభివృద్ధే ఆ అవ‌మానాల‌కు స‌మాధానంగా నిలుస్తున్నారు.

ప్ర‌ధాని మోదీ గురించి మాట్లాడుతూ మంత్రి లోకేశ్ (Nara Lokesh) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర విభ‌జ‌న‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జ‌రిగింద‌న్నారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ఏపీ ప్రయాణం మొద‌లైతే మోదీ అండ‌గా నిలిచి ఆదుకున్నార‌ని తెలిపారు. న‌మో అంటే భార‌త దేశంలో న‌రేంద్ర మోదీ అని అర్థం ఉంద‌ని, ఏపీలో మాత్రం న‌మో అంటే నాయుడుజీ, మోదీజీ అంటార‌ని చెప్పారు. అల్లూరి సీతారామ‌రాజులో ఉన్న ప‌ట్టుద‌ల, పౌరుషం, దేశ భ‌క్తి త‌న‌కు న‌రేంద్ర మోదీలో క‌నిపిస్తాయ‌ని లోకేశ్ అన్నారు. న‌మో అంటే ధైర్యం, విశ్వాసం, సుర‌క్షిత భార‌త్ అని లోకేశ్ కొనియాడారు. మోదీ అంటే శ‌త్రువుల‌కు భ‌య‌మ‌ని చెప్పారు. విక‌సిత్ భార‌త్‌, గ‌రీబ్ క‌ల్యాణ్‌, భ‌విష్య‌త్తు గ్యారీంటీ.. ఇలా ప్ర‌తి ఒక్క దానికి ప్ర‌ధాని మోదీయే స‌మాధాన‌మ‌ని లోకేశ్ స్ప‌ష్టం చేశారు.

Also Read : ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికాం: సీఎం చంద్రబాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>