గుడ్‌న్యూస్.. 11,403 పోస్టులతో IBPS భారీ నోటిఫికేషన్ రిలీజ్

కలం, వెబ్ డెస్క్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS Notification ).. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తో సుమారు 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ లో తెలిపిన వివరాలు మేరకు తెలంగాణలో 191 ఉద్యోగాలు, ఏపీలో 186 పోస్టులు ఉన్నాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి ఆగస్టు 1వ తారీఖు నుంచి 21 వరకు అప్లై చేసుకునేందుకు వీలు కల్పించారు. ఆన్ లైన్ లో అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది.

అక్టోబర్ నెలలో ప్రిలిమ్స్ పరీక్ష, డిసెంబర్ లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జీతభత్యాలు రూ. 24 వేల నుంచి రూ.64వేల వరకు నిర్ధారించారు. ఈ పోస్టులకు అప్లై చేసేందుకు దరఖాస్తుదారుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ /ఎస్టీ క్యాండిడేట్లకు రూ.175, ఇతరులకు రూ.850గా అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>