వరల్డ్ కప్ తర్వాత మెక్సికో తొలి మ్యాచ్.. కొలంబియాతో ఢీ!

కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్ తర్వాత మెక్సికో, కొలంబియా జట్లు మరోసారి ఫుట్‌బాల్ మైదానంలో తలపడనున్నాయి. అమెరికా వేదికగా సెప్టెంబర్‌లో జరగనున్న స్నేహపూర్వక మ్యాచ్‌లో ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. సెప్టెంబర్ 26న అమెరికాలోని బాల్టిమోర్‌లో మెక్సికో, కొలంబియా (Mexico vs Colombia) మధ్య మ్యాచ్ జరగనుంది. మెక్సికో జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రఫాయెల్ మార్కెజ్‌కు ఇది తొలి మ్యాచ్ కానుంది.

ఈ మ్యాచ్ అనంతరం మెక్సికో మరో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 29న న్యూయార్క్‌లో పెరూతో, అక్టోబర్ 6న లాస్ ఏంజెల్స్‌లో చిలీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లు ఫిఫా అంతర్జాతీయ విండోలో భాగంగా నిర్వహించనున్నారు. మెక్సికన్ ఫుట్‌బాల్ సమాఖ్య ప్రకారం, బలమైన అంతర్జాతీయ జట్లతో ఆడటం ద్వారా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న మెక్సికోకు ఈ మ్యాచ్‌లు కీలక పరీక్షగా మారనున్నాయి. జట్టు భవిష్యత్ లక్ష్యాల కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని సమాఖ్య తెలిపింది.

ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో మెక్సికో, కొలంబియా జట్లు ప్రీక్వార్టర్ ఫైనల్ దశలోనే నిష్క్రమించాయి. మెక్సికో ఇంగ్లండ్ చేతిలో 3-2 తేడాతో ఓటమి పాలవగా, కొలంబియా స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్ ద్వారా 4-3 తేడాతో పరాజయం చవిచూసింది. వరల్డ్ కప్ నిరాశ తర్వాత కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్లకు సెప్టెంబర్ మ్యాచ్ కీలకంగా మారనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>