మీ సేవా ఆప‌రేట‌ర్‌తో ఎంఐఎం ఎమ్మెల్యే దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎంఐఎం నేత‌, నాంప‌ల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ (MIM MLA Majid Hussain) మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. ఓ మ‌హిళా మీ సేవా ఆప‌రేట‌ర్‌తో మ‌జీద్ దురుసుగా ప్రవర్తించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విధుల్లో ఉన్న స‌ద‌రు మ‌హిళ‌ను కేవలం చిల్లర లేదనే కారణంతో ఆయన తీవ్రంగా మాటలతో వేధించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో సోష‌ల్ మీడియాలో న‌టిజ‌న్లు ఆయ‌న‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు.

ఎంఐఎం పార్టీలో బెదిరింపు ధోరణి, గూండాయిజం సంస్కృతి ఉందని విమర్శిస్తున్నారు. ఓవైసీ సోదరుల నుంచి పార్టీ కార్యకర్తల వరకు ఇదే తరహా వైఖరి కనిపిస్తోందని ఇత‌ర పార్టీ నేత‌లు దాడి చేస్తున్నారు. మ‌రోవైపు బీజేపీ నేత‌ల‌ను, కాంగ్రెస్ నేత‌ల‌ను ట్యాగ్ చేస్తూ ఈ ఘ‌ట‌న‌పై స్పందించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై మజీద్ హుస్సేన్ (Majid Hussain) నుంచి గానీ, ఎంఐఎం పార్టీ నుంచి గానీ ఎలాంటి స్పంద‌న రాలేదు. మ‌జీద్ త‌క్ష‌ణ‌మే దీనిపై స్పందించాల‌ని కొంద‌రు నెటిజ‌న్లు ఆయ‌న‌ను ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేస్తున్నారు.

Also Read : దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం పెంచడమే లక్ష్యం : సీఎం రేవంత్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>