సాయిపల్లవినే డామినేట్ చేసింది.. ఎవరీ బ్యూటీ?

కలం, సినిమా : దర్శకుడు నితీశ్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారత ఇతిహాస కావ్యం  ‘రామాయణ’. ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్,  సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తుండగా.. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను (Ramayana Trailer) మేకర్స్ రిలీజ్ చేశారు.

విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  రాముడిగా రణ్‌బీర్ లుక్ ఎంతగానో ఆకట్టుకోగా, రావణుడిగా యశ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక సీతాదేవి పాత్రలో సాయిపల్లవి అద్భుతంగా కనిపించింది. ఇదిలా ఉంటే ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

సీత పాత్రలో నటించిన సాయిపల్లవితో పాటు మరో యువ నటి కూడా ఫుల్ వైరల్ అయింది. ట్రైలర్‌లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుందని, సాయిపల్లవినే డామినేట్ చేసిందంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆ యువ నటి పేరు సురభి దాస్ (Surabhi Das). టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ‘రామాయణం’ ట్రైలర్‌లో  కనిపించిన కొద్ది సెకన్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సురభి దాస్‌కు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

Also Read : హీరోయిన్ రష్మిక మందన్నకు ప్రమాదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>