కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy)కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. “ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డికి అధికారిక లాంఛనాలు ఉండవా?” అంటూ పలువురు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధికారులు, పోలీసు శాఖ అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలకు గౌరవ సూచకంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన అభిమానులు, ఉద్యమ సహచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

