కలం, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు ప్రమాదం జరిగింది. సినిమా షూటింగులో భాగంగా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో నడుము భాగంలో గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమె సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేశారు. అనంతరం గాయం తీవ్రత నేపథ్యంలో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. రష్మిక తాజాగా ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే భారీ స్టంట్లు చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇక్కడే ప్రమాదం జరిగిందా.. మరో సినిమానా.. అనేది తెలియాల్సి ఉంది.
Also Read : సాయిపల్లవినే డామినేట్ చేసింది.. ఎవరీ బ్యూటీ?
Follow Us On : WhatsApp

