కలం, నిర్మల్: భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కార్మికులకు కిట్ డ్రెస్సులు, గ్లౌజులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel), మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాద్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Also Read : తెలంగాణలో సర్ ప్రక్రియ పొడిగింపు
Follow Us On : WhatsApp

