మోదీ, అమిత్​షాకు రాహుల్​ గాంధీ వార్నింగ్​

కలం, వెబ్​ డెస్క్​: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఉద్దేశించి కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శించారు. జెన్-జీ (Gen Z) యువతను భయభ్రాంతులకు గురిచేసి ఎప్పటికీ నోరు మూయించలేరని హెచ్చరించారు. మొదట విద్యార్థులపై దాడి చేసి వారి ఎముకలు విరగ్గొట్టారని, ఇప్పుడు వారిపై తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీరు గతం.. యువతతో కాస్త జాగ్రత్తగా ఉండండి’ అంటూ మోదీ, షాలకు రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు.

కాగా పేపర్ లీక్స్‌పై మరోసారి మోదీ వీడియో విడుదల చేశారు. ’’పేపర్ లీక్ గ్యాంగ్స్ ను వదిలిపెట్టం.. పకడ్బందీ పరీక్షా విధానానికి కేంద్రం కట్టుబడి ఉంది.. పార్లమెంట్ లో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాస్ చేశాం.. యాంటీ పేపర్ లీక్.. పరీక్ష వ్యవస్థను పటిష్టం చేస్తుంది.. సాంకేతికతను పూర్తిస్థాయిలో వాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఈ వీడియోనుద్దేశించి పరోక్షంగా రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>