కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) 15వ ఆవిర్భావ దినోత్సవ గోడపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, ప్రైవేట్ పాఠశాలల ట్రస్మా నిర్మల్ టౌన్ అధ్యక్షుడు పడాల చంద్రగౌడ్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీజీవీపీ ప్రారంభం నుంచే విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ టౌన్ అధ్యక్షుడు ఆత్మరాం, అర్జున్, సిద్ధు, దినేశ్ జాదవ్, శ్రీకాంత్, గణేశ్ పాల్గొన్నారు.
Read Also: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నిర్మల్‌లో రెండేళ్ల తర్వాత పరిషత్ సమావేశాలు
Follow Us On : WhatsApp

