గురుపూర్ణిమ వేళ.. గురువుకు పాదపూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: భారతీయ సాంప్రదాయంలో గురువు స్థానం దైవంతో సమానమని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) అన్నారు. గురు పూర్ణిమ సందర్భంగా నిజామాబాద్ (Nizamabad) లో గురువు కోన సముందర్ శ్రీనాథ్ శర్మ దంపతులకు కుటుంబ సమేతంగా పాద పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురువులు జీవితంలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదిస్తారని పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న గురు శిష్య సంప్రదాయానికి ఈరోజు ప్రతీక అన్నారు. అనేకమంది సన్యాసులు, యోగులు ఈ రోజున కొత్త దీక్షలు, జపాలు, సాధనలు ప్రారంభిస్తారని తెలిపారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మ స్వరూపుడని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>