కలం, వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలోని ఏదుల మండలానికి (Yedula Mandal) తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. అద్దె భవనం/శిథిలావస్థలో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు G.O.Rt.No.428 ప్రకారం రూ.2.25 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.
ఏదుల మండల (Yedula Mandal) ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణంతో ప్రజలకు ఒకేచోట మెరుగైన ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ అభివృద్ధి పనులకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధికి అవసరమైన మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Also: జెన్ జీ.. వయా ఇన్స్టా.. మోదీ నయా ప్లాన్!
Follow Us On : WhatsApp

