కలం, మెదక్ బ్యూరో: దుబ్బాక నియోజక వర్గ అభివృద్ధి విషయంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దుబ్బాక ఎమ్మెల్యే (Dubbak MLA) కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రజలతో కలిసి ముట్టడించేందుకు వెనుకాడబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Dubbak MLA) అభివృద్ధిపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని, అందుకు ఎవరు అడ్డొచ్చినా ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని అన్నారు.
ఉద్యమాల గడ్డ దుబ్బాక శక్తి ఏమిటో మరోసారి చూపించే పరిస్థితి వస్తుందని ఘాటుగా అధికారులను హెచ్చరించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు.
Read Also: జెన్ జీ.. వయా ఇన్స్టా.. మోదీ నయా ప్లాన్!
Follow Us On : WhatsApp

