జూరాలకు పెరుగుతున్న వరద ప్రవాహం

కలం, మహబూబ్ నగర్ : కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి దిగువకు కృష్ణా జలాలు విడుదల చేస్తుండటంతో జూరాలలో (Jurala Project) క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. బుధవారం ఉదయం జూరాలలో పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా 6.969 టీఎంసీలు ఉండగా ఎగువ నుంచి 89,520 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

మరోవైపు జూరాల మీద ఆధారపడిన ఉన్న ఎత్తిపోతల పథకాల్లో లిఫ్ట్‌లను ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తికి 6,799, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా-1కు 1300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులను లిఫ్ట్‌ చేసి తరలిస్తున్నారు. ఆలమట్టికి ఎగువ నుంచి 68,525 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 80,000 క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 62,171 క్యూసెక్కులు వస్తుండగా 89,520 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

Read Also: తుంగతుర్తి ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>