గుండు చేసుకుంటే డబ్బు.. తమిళనాడులో ఘరానా మోసం!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలుగు సినిమా విక్ర‌మార్కుడు త‌ర‌హాలో త‌మిళ‌నాడులో ఓ గుండు మోసం వెలుగులోకి వ‌చ్చింది. కొంద‌రు దుండ‌గులు ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఫోన్ చేస్తున్నామ‌ని, గుండు చేసుకుంటే డ‌బ్బులు ఇస్తామ‌ని న‌మ్మించి మ‌హిళ‌ల‌ను బురిడీ కొట్టించారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని సేలం (Salem) జిల్లా పుదుకొత్తంబాడిలో కొంద‌రు మ‌హిళ‌ల‌కు ఇటీవ‌ల కొన్ని ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. త‌హ‌సీల్దార్ కార్యాల‌యం నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా దేశంలో క‌రోనా విస్త‌రిస్తోంద‌ని, మీ ప్రాంతంలో కూడా క‌రోనా లాంటి కొత్త వ్యాధి సోకుతుంద‌ని మ‌హిళ‌ల‌ను భ‌య‌పెట్టారు. విదేశాల్లో ఈ వ్యాధి సోకిన వారంతా గుండు చేసుకున్నార‌ని, ఇప్పుడు త‌మిళ‌నాడులో కూడా ఇదే ప‌ద్ధ‌తి అనుస‌రిస్తున్నామ‌ని చెప్పారు. దీని కోసం ప్ర‌భుత్వం మ‌హిళల‌కు రూ.15 వేలు, కాలేజీ స్టూడెంట్ల‌కు రూ.45 వేలతో పాటు ల్యాప్‌ట్యాప్‌, పురుషుల‌కు రూ.6 వేలు ఇస్తున్న‌ట్లు తెలిపారు.

Salem Scam | త‌మ ద‌గ్గ‌ర ఉన్న జాబితాలో ఉన్న నెంబ‌ర్ల‌కే ఫోన్లు చేస్తున్న‌ట్లు న‌మ్మించారు. ఇది న‌మ్మిన ఓ మ‌హిళ గుండు చేయించుకుంది. అంతే కాకుండా త‌మ స‌మీపంలో ఉన్న కొంద‌రు మ‌హిళ‌ల‌కు కూడా విష‌యం చెప్పింది. ఆమె మాట‌లు న‌మ్మి మ‌రో ముగ్గురు మ‌హిళ‌లు గుండు చేసుకున్నారు. ఆ త‌ర్వాత త‌మ‌కు కాల్స్ వ‌చ్చిన నెంబ‌ర్‌కు తిరిగి కాల్ చేయ‌గా స్విచ్ ఆఫ్ వ‌చ్చింది. దీంతో స‌ద‌రు మ‌హిళ‌లు మోస‌పోయామ‌ని గుర్తించారు.

Read Also: కారులో ఆయన వణికిపోతూ కనిపించారు: రాహుల్ గాంధీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>