పేపర్ల లీకేజీలపై శిక్షలు ఎక్కడ?: ప్రియాంక గాంధీ

కలం, వెబ్ డెస్క్: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 152 సార్లు పేపర్ల లీకేజీలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. ఒక్కరికి కూడా శిక్షలు పడలేదని విమర్శించారు. లోక్‌సభలో యాంటీ పేపర్ లీకేజీ బిల్లుపై జరిగిన చర్చలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. నీట్ లీకేజీకి కచ్చితంగా ప్రధాని మోదీ బాధ్యత వహించాలని.. తప్పించుకోవాలనుకుంటే కుదరదని తేల్చి చెప్పారు.

పెల్లెట్ గన్స్ వాడుతారా..?

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విమర్శించారు. ఇలా చేయాలని పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. అసలు కేంద్రం ఉద్దేశం ఏంటీ..? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే, ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read Also: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>