గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ: నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) అన్నారు. మంగళవారం నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామంలో నాగవ్వకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు అందిన డబ్బుల వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Nirmal Collector) మాట్లాడుతూ.. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇంటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంతకుముందు గ్రామశివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు.

ఇండ్లకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. సొంత స్థలాలు ఉన్న ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్ పాండ్‌ను పరిశీలించారు. రైతులంతా ఫామ్ పాండ్ల నిర్మాణాలకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, ఎంపీడీఓ సుధాకర్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ రఘు పాల్గొన్నారు.

Read Also: కేసీఆర్ కుటుంబంపై కవిత సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>