కేంద్రంపై యువతలో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై యువతలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఢిల్లీలో జరిగిన నిరసనలు చాలా ప్రత్యేకమైనవని, దేశ రాజకీయాల్లోనే కీలక మలుపు అన్నారు. ఇది కేవలం నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కాదని.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తులకు ఒక ట్రిగ్గర్ పాయింట్ వంటిదన్నారు.

ప్రతిపక్షాలకు కూడా..

విద్యార్థుల నిరసనలు కేవలం ప్రభుత్వంపైనే వ్యతిరేకతమని అనుకుంటే పొరపాటేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కూడా పాఠాలు నేర్చుకుని, యువత ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి నిరసనలే ఆ పార్టీలకు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదన్నారు. పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే.. కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేశారు.

Read Also: పతకాల వేటలో భారత్.. నేడు కీలక ఈవెంట్స్

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>