అందుకే మోదీ వీడియో బ్లాక్.. స్పందించిన మెటా సంస్థ

కలం, వెబ్ డెస్క్ : ఫేస్‌బుక్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో (PM Modi video) నిలిపివేతపై మెటా (Meta) సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ కంటెంట్‌ను పొరపాటున తొలగించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ వీడియోను పునరుద్ధరించినట్లు తెలిపింది. కాగా, మోదీ వీడియో బ్లాక్ కావడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కేంద్రమంత్రిత్వశాఖ మెటా, ఇన్‌స్టాగ్రామ్ హెడ్లకు సమన్లు జారీ చేసింది.

కాగా, నీట్ పేపర్ లీక్ వివాదంతో చెలరేగుతున్న నిరసనల మధ్య, గత వారం ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి సోషల్ మీడియలో వీడియో పోస్ట్ చేశారు. వీడియో మోదీ వారిని ‘మిత్రులారా’ అని సంబోధిస్తూ నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన శిక్షలు విధించేందుకు కేంద్రం బిల్లు తీసుకొస్తుందని ప్రకటించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>