కలం, వెబ్ డెస్క్: గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ విద్యార్థి అభినవ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా కల్పించారు. ల్యాప్‌టాప్ అందజేసి, కళాశాల ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తమకు గిఫ్ట్ అందజేసిన కేటీఆర్‌కు విద్యార్థి అభినవ్, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్.. తన పేరెంట్స్ లక్ష్మీనారాయణ, శ్రీలతలతో కలిసి హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐఐటీలో సీటు సాధించిన అభినవ్‌ను కేటీఆర్ శాలువాతో ఘనంగా సత్కరించి విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేశారు. కాలేజీ ఫీజు కూడా తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చి, చక్కగా చదువుకొని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

