కలం, వరంగల్ బ్యూరో: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) ఆదివారం గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ (Chandrugonda) గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని భగవంతుడిని ప్రార్థించామని తెలిపారు. ఆయనకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి, త్వరలోనే ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.
Read Also: పార్లమెంట్‌కు ధర్మేంద్ర.. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన!
Follow Us On : WhatsApp

