పంజాబ్ పేప‌ర్ లీకులు.. సీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ల‌పై విమ‌ర్శ‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: నీట్ పేప‌ర్ లీక్‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసిన త‌రుణంలో సీజేపీ, ఆప్‌, కాంగ్రెస్ పార్టీల‌పై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. పంజాబ్‌లో పేప‌ర్ లీకు (Punjab Paper Leak) ల‌పైన కూడా కాక్రోచ్ పార్టీ ఆందోళ‌న చేప‌డుతుందా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. కొంద‌రు రిపోర్ట‌ర్లు బ‌హిరంగంగానే కాక్రోచ్ పార్టీ ప్ర‌తినిధుల‌ను దీనిపై ప్ర‌శ్నించారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉంద‌ని, అక్క‌డ జ‌రుగుతున్న పేప‌ర్ లీకుల‌కు బాధ్య‌త వ‌హిస్తూ పంజాబ్ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేస్తారా? అని నిల‌దీశారు.

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పంజాబ్‌కి వెళ్లి నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని, అక్క‌డి విద్యార్థుల‌కు కూడా న్యాయం చేయాల‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ మొద‌లైంది. కాక్రోచ్ పార్టీ అన్ని రాష్ట్రాల విద్యార్థుల‌ను స‌మానంగా చూడాల‌ని, పంజాబ్‌లో ఎందుకు త‌మ పోరాటం చేయ‌డం లేద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక దీనిపై సీజేపీ ప్ర‌తినిధులు అశుతోష్‌ను మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌కుండానే దాట‌వేసే ప్ర‌య‌త్నం చేశారు.

పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వ‌చ్చాక నాలుగు ప్ర‌ధాన పేప‌ర్లు లీక్ అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 12వ త‌ర‌గ‌తి, గ్రూప్ బీ, ఫార్మాసిస్ట్‌, త‌దిత‌ర పేప‌ర్లు ఇందులో ఉన్నాయి. దీనికి బాధ్య‌త వ‌హిస్తూ పంజాబ్ సీఎం, విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: రాజకీయాలకు గుడ్​ బై.. మాజీ సీఎం సంచలన నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>