కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. విష జ్వరాలు ప్రభలటంతో ఇద్దరు చిన్నారులు చనిపోవడం (Two Children Die) తీవ్ర కలకలం రేపుతోంది. పొరండ్ల గ్రామంలో విషజ్వరాలతో హరిస్మిత (6), వరుణ్ తేజ్ (6) అనే ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో గ్రామంలో చీకటి ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల జబ్బులు సరైన కారణం అంతుచిక్కకపోవడంతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరో 20 మంది జ్వరాల బారినపడటంతో గ్రామస్తులు వైద్య సేవలు మెరుగుపరచాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ రావడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తంగా అయ్యారు. గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు ఇంటింటికీ ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.

